టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మెగా 157 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇక అనిల్ రావిపూడి మరోసారి తనదైన స్ట్రాటెజీతో ఈ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. సంక్రాంతి 2026 టార్గెట్‌గా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
ప్రస్తుతం ముస్సోరిలో ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా కోసం మెగాస్టార్ తన దూకుడు పెంచారు. సినిమాను వీలైనంత ఫాస్ట్‌గా పూర్తి చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే మెగా 157 చిత్రం ముస్సోరి షెడ్యూల్ షూటింగ్ ముగించుకున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ షెడ్యూల్లో చిరంజీవిపై కొన్ని హై వోల్టేజ్ సీన్స్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో అందాల భామ నయనతార కూడా పాల్గొంది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.