SSMB29: అత్యంత ఖరీదైన సెట్టింగ్..? రాజమౌళి విజన్ వైరల్

సైలెంట్ గానే షూటింగ్ జరిగిపోతున్నప్పటికీ టోటల్ ఇండియన్ సినిమా సహా పాన్ వరల్డ్ లెవెల్లో మార్క్ వేయగలిగే భారీ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో చేస్తున్న సినిమానే అని చెప్పాలి.

ఆల్రెడీ మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా శరవేగంగా కంప్లీట్ అవుతుంది. అయితే రాజమౌళి సినిమా అంటేనే ఇపుడు భారీ ఖర్చు ఊహాతీతమైన సెట్టింగులు.. అలానే RRR, బాహుబలి సినిమాలతో కొత్త ప్రపంచాలు చూపించిన జక్కన్న మహేష్ బాబు సినిమా కోసం ఏకంగా ఇండియా లోనే అత్యంత ఖరీదైన సెట్టింగ్ వేయిస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఏకంగా 50 కోట్ల బడ్జెట్ తో వారణాసి సెట్టింగ్ ని చేస్తున్నారని తెలుస్తుంది. ప్రతీ అంశాన్ని జాగ్రత్తగా తీసుకొని ఈ మొత్తం సెట్టింగ్ ని మేకర్స్ వేస్తున్నారట. మేజర్ పార్ట్ షూటింగ్ ఇక్కడే జరగనుండగా ఇది ఇండియాలోనే అత్యంత ఖరీదైన సెట్టింగ్స్ లో ఒకటి అని తెలుస్తుంది. మరి బిగ్ స్క్రీన్స్ పై ఆ విజువల్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Exit mobile version