టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’ రిలీజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, విజయ్ దేవరకొండకు బాలీవుడ్‌లో ఓ భారరీ సినిమాలో ఆఫర్ వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్‌లో తెరకెక్కబోతున్న ప్రెస్టీజియస్ సీక్వెల్ ‘డాన్-3’ సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు. ఫర్హాన్ అక్తర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విలన్ పాత్రలో విజయ్ దేవరకొండను తీసుకోవాలని మేకర్స్ భావించారు. దీని కోసం విజయ్‌ను అప్రోచ్ కూడా అయ్యారట. అయితే, ఈ ఆఫర్‌ను ఆయన సున్నితంగా తిరస్కరించాడు.
ప్రస్తుతం తెలుగు చిత్రాలపైనే తన ఫోకస్ ఉందని.. అందుకే మిగతా భాషల్లో సినిమాలు చేయడం ఇష్టం లేదని విజయ్ వారికి చెప్పాడట. దీంతో ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం వేరొక యాక్టర్‌ను తీసుకునేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ చిత్రాన్ని జనవరి 2026 నుంచి షూటింగ్ ప్రారంభించనున్నట్లు బిటౌన్ వర్గాలు చెబుతున్నాయి.