బుల్లితెర తో పాటు వెండితెరపై కూడా తన గ్లామర్, నటనతో బిజీగా ఉండే అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో కూడా అంతే బిజీగా ఉంటుంది. తన హాట్ ఫోటోలతో పాటు డైలీ థింగ్స్‌ను కూడా ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అయితే, ఆన్‌లైన్‌లో నిత్యం బిజీగా ఉండే అనసూయ, ఇప్పుడు అదే ఆన్‌లైన్‌లో మోసపోయానంటూ చెప్పుకొచ్చింది.
ఇన్‌స్టాలో నిత్యం బిజీగా ఉండే అనసూయ ఓ వెండర్ పేజీ అయిన ట్రఫిల్ ఇండియా నుంచి కొన్ని వస్తువులను ఆర్డర్ చేసింది. అయితే, ఈ ఆర్డర్‌కు సంబంధించిన పేమెంట్ కూడా ఆమె చేసిందట. కానీ, రోజులు గడుస్తున్నా తనకు సదరు వెండర్ నుంచి ఎలాంటి వస్తువులు రాలేదని.. ఈ విషయంపై తాను స్పందించూకడదని అనుకున్నానని.. కానీ, మిగతా వారు తనలాగా మోసపోవద్దని చెప్పేందుకు ఆమె ఈ పోస్ట్ చేస్తున్నట్లు పేర్కొంది.
సామాన్య ప్రజలతో పాటు ఇలా సెలబ్రిటీలు సైతం ఆన్‌లైన్ మోసాల బారిన పడుతుండటం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.