మెగా 157 టైటిల్‌పై సరికొత్త బజ్.. నిజమైతే మెగా ఫ్యాన్స్‌కు పండగే!

మెగా 157 టైటిల్‌పై సరికొత్త బజ్.. నిజమైతే మెగా ఫ్యాన్స్‌కు పండగే!

Published on Jul 13, 2025 8:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తనదైన ట్రీట్మెంట్‌తో రూపొందిస్తున్నాడు దర్శకుడు అనిల్. అయితే, మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 157వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘మెగా157’ అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరణ చేస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌పై ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో చిరు ఓ డ్రిల్ మాస్టర్‌గా కనిపిస్తాడు. దీంతో ఈ సినిమాలో ఆయన పేరు శివశంకర్ వరప్రసాద్ గా ఉంటుందని.. అందుకే ఈ సినిమాకు ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ ఇదే నిజమైతే చిరంజీవి ఫ్యాన్స్‌కు ఇది ట్రీట్ అని చెప్పాలి. తన అసలైన పేరుతో మెగాస్టార్ సినిమా వస్తుండటాన్ని వారు ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు