‘అఖండ 2’ కొత్త డేట్ ఇదేనా?

‘అఖండ 2’ కొత్త డేట్ ఇదేనా?

Published on Jul 13, 2025 1:14 PM IST

నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా సంయుక్త అలాగే హర్షాలీ మల్హోత్రా ముఖ్య పాత్రల్లో మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “అఖండ 2 తాండవం” ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ పాన్ ఇండియా సినిమా రీసెంట్ గానే వచ్చిన టీజర్ మరిన్ని అంచనాలు పెంచింది. అయితే ఈ సినిమా విడుదల ఆల్రెడీ సెప్టెంబర్ కి లాక్ చేసారు.

అయితే ఓ పక్క పోటీ మరింత రసవత్తరంగా మారడం ఇంకోపక్క అఖండ గ్రాఫిక్స్ పనులు కూడా ఒక కొలిక్కి వచ్చే సూచనలు కూడా లేకపోవడంతో డిసెంబర్ విడుదల చూస్తున్నట్టు రూమర్స్ వచ్చాయి. అయితే డిసెంబర్ లో కూడా గట్టి పోటీ అయితే ఉంది.
తెలుగు నుంచి రాజా సాబ్, హిందీ నుంచి పలువురు స్టార్ హీరోల సినిమాలు మొదటి వారం నుంచే ఉంటే ఎండింగ్ లో కూడా పలు సినిమాలు ఉన్నాయి. అయితే వీటికి మధ్యలో మేకర్స్ రావాలని చూస్తున్నారట. ఇలా డిసెంబర్ 18 డేట్ అఖండ2 కి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజం అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు