యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కె-ర్యాంప్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను జైన్స్ నాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మేకర్స్ రూపొందిస్తున్నారు. అయితే, ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.
కె-ర్యాంప్ చిత్రంలో కిరణ్ అబ్బవరం సరికొత్త అవతారంలో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలోని అతని పాత్రను ‘చిల్లర్ గయ్’ అంటూ వివరిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో గ్లింప్స్‌ను జూలై 14న రిలీజ్ చేస్తున్నారు. కాగా ఇందులో ఆయన ఎలాంటి లుక్‌లో కనిపిస్తాడనే విషయంపై తాజాగా ఓ సాంపిల్ వదిలారు.
ఇక ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తుండగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.