విలక్షణ నటి టి.జి కమలా దేవి మనకిక లేరు


గత కొంత కాలంగా అనారోగ్యంతో భాద పడుతున్న విలక్షణ నటి టి.జి కమలా దేవి ఈ రోజు చెన్నైలో మరణించారు. 1929 చితూరు జిల్లాలోని కార్వేటినగరంలో గోవిందమ్మ అనే పేరుతో జన్మించారు. కమలా దేవి నటి గానే కాకుండా గాయనిగా మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సినిమాలకు పనిచేశారు. ఈమె ఎన్నో డ్రామాల్లో మరియు స్టేజ్ షోలలో నటించి ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ నుంచి నాటక కళా ప్రపూర్ణ అనే అవార్డును కూడా గెలుచుకున్నారు. ‘మల్లీశ్వరి’, ‘పాతాళభైరవి’, ‘కథానాయకుడు’, ‘బాలానగమ్మ’ మొదలైన చిత్రాల ద్వారా కమలా దేవి మంచి పేరు సంపాదించుకున్నారు. ‘పల్లెటూరి సుందరి’ మరియు గుణసుందరి కథ’ లాంటి చిత్రాలకు ప్లేబాక్ సింగర్ గా తన గాత్రాన్ని కూడా అందించారు.

టి.జి. కమలా దేవి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మరియు వారి కుటుబ సభ్యులకు 123తెలుగు.కామ్ తరపున సంతాపాన్ని తెలియజేస్తున్నాం.

Exit mobile version