విషాదం : ‘అభినయ సరస్వతి’ బి.సరోజాదేవి కన్నుమూత

భారత సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. నిన్న(జూలై 13) తెలుగు లెజెండరీ నటుడు కోట శ్రీనివాస రావు మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషాదం నుంచి కోలుకోకముందే.. సీనియర్ నటి బి.సరోజాదేవి కన్నుమూసిన వార్త సినీ అభిమానులను కలచివేస్తుంది.

కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 200 సినిమాలకు పైగా నటించిన సరోజాదేవి 1938 జనవరి 7న జన్మించారు. 1955లో ‘మహాకవి కాళిదాసు’ చిత్రంతో ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు. ఇక ఆ తర్వాత ఆమె ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. తెలుగులోనూ ఆమె పలు హిట్ చాత్రాల్లో నటించారు. బడిపంతులు, భూకైలాస్‌, సీతారామ కల్యాణం, కష్టసుఖాలు, జగదేకవీరుని కథ, ఇంటికి దీపం ఇల్లాలే, పవిత్ర ప్రేమ, శ్రీకృష్ణార్జున యుద్ధము, దానవీర శూర కర్ణ, ఆత్మబలం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో సరోజాదేవి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

ఆమెను పద్మశ్రీ, పద్మభూషణ్‌ పురస్కారాలతో భారత ప్రభుత్వం సత్కరించింది. ఇక ఆమె మరణవార్తతో దక్షిణ సినీ పరిశ్రమ నుంచి పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు.

Exit mobile version