‘మహారాజ’ డైరెక్టర్‌తో రజినీకాంత్ నెక్స్ట్ మూవీ..?

తమిళ వెర్సటైల్ నటుడు విజయ్ సేతుపతి కెరీర్‌లో ‘మహారాజ’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ డైరెక్ట్ చేసిన ఈ రివెంజ్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఇందులో విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.

అయితే, ఇప్పుడు ఈ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా రజినీకాంత్‌ను కలిసిన నిథిలన్ స్వామినాథన్ ఆయనకు ఓ కథ వివరించినట్లు తెలుస్తోంది. దీనికి రజినీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కోలీవుడ్ వర్గాల టాక్.

మరి రజినీకాంత్‌తో ఈ డైరెక్టర్ ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక వీరి కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి బ్లాక్‌బస్టర్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

Exit mobile version