ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు పి.మహేష్ బాబు తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యేలా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజికల్ ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రంలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను జూలై 18న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఇదొక మంచి లవ్ సాంగ్‌గా ఉండబోతుందని హీరో రామ్ పోతినేని క్లూ వదిలాడు. ఈ సినిమాకు వివేక్-మర్విన్ ద్వయం సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ పాట యూత్‌ను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ఉపేంద్ర ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.