టాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేస్తున్న కమెడియన్ కమ్ హీరో ప్రియదర్శి తాజాగా ‘ప్రేమంటే’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నవనీత్ శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ లుక్, మోషన్ పోస్టర్‌ను అక్కినేని నాగచైతన్య లాంచ్ చేశాడు.
ఈ పోస్టర్‌లో ప్రియదర్శితో పాటు హీరోయిన్ ఆనంది చాలా సరదాగా ముచ్చటించుకుంటున్నారు. ఈ పోస్టర్‌తోనే సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యేలా చేశారు మేకర్స్. ఇక ఈ చిత్రానికి ‘థ్రిల్లు ప్రాప్తిరస్తు’ అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. ఈ సినిమాలో లవ్, కామెడీ, థ్రిల్స్ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.