పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేయగా పూర్తి హిస్టారికల్ ఎపిక్ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో నిర్వహిస్తారని తెలుస్తోంది. కాగా, ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు గెస్టులుగా స్టార్ డైరెక్టర్స్ రాజమౌళి, త్రివిక్రమ్ వస్తారని సినీ సర్కిల్స్ టాక్. ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఓకే.. గెస్టులుగా ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ ఓకే.. కానీ, ఇంతకీ ఈ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ వస్తాడా.. అనేది ఇప్పుడు అందరిలో నెలకొన్న ప్రశ్న. రాజకీయంగా చాలా బిజీగా ఉన్న పవన్ ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు వస్తాడా రాడా అని అభిమానులు సైతం ఆతృతగా చూస్తున్నారు.
ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు. జూలై 24న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.