అందాల భామ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె దక్షిణాది భాషల్లో సినిమాలు చేస్తూ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక మలయాళంలో ఆమె నటిస్తున్న ‘JSK – జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ చిత్రం ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను పూర్తి కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులు ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ చిత్ర కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలోని ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అందరినీ కట్టిపడేయడం ఖాయమని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.
ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌తో పాటు మలయాళ స్టార్ హీరో సురేష్ గోపీ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను జూలై 17న మలయాళంతో పాటు తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.