టాలీవుడ్‌లో ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా అదిరిపోయే హిట్ అందుకున్నాడు వేణు యెల్దండి. ఇక తన డైరెక్షన్‌లో రెండో సినిమాగా ‘ఎల్లమ్మ’ అనే చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో హీరోగా నితిన్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు.
అయితే, ఇటీవల నితిన్‌తో కలిసి దిల్ రాజు ‘తమ్ముడు’ అనే చిత్రాన్ని చేశాడు. కానీ, ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు ఎల్లమ్మ చిత్రం కోసం దిల్ రాజు ఓ నిర్ణయం తీసుకున్నాడట. ఈ సినిమాలో నటించేందుకు నితిన్‌కు లాభాల్లో షేర్ ఇవ్వాలని ఆయన ప్రతిపాదించాడట. దీనికి నితిన్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా కోసం నితిన్ ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా నటించనుండటం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్ర షూటింగ్‌ను త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.