అక్టోబర్ లో మసాలా??

అక్టోబర్ లో మసాలా??

Published on Sep 25, 2013 4:12 AM IST

Venkatesh-Ram-Masala

వెంకటేష్, రామ్ కలిసి నటిస్తున్న ‘మసాలా’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాను ముందుగా నవంబర్ లో విడుదల చేద్దాం అనుకున్నా, నిర్మాతలు ఇప్పుడు అక్టోబర్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.ఈ సినిమా హిందీలో విజయం సాధించిన ‘బోల్ బచ్చన్’ కు రీమేక్. చాలా కాలం విరామం తరువాత విజయభాస్కర్ దర్శకుడు. స్రవంతి రవికిషోర్ మరియు సురేష్ బాబు నిర్మాతలు. వెంకటేష్ సరసన అంజలి, రామ్ సరసన శాజన్ పదాంసీ హీరోయిన్స్
ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడు. ఆగష్టు 23 న ఆడియో విడుదల కావాల్సివున్నా కొన్ని కారణాల వల్ల వాయిదాపడింది. కొత్త తేదిని త్వరలోనే తెలుపుతారు

తాజా వార్తలు