ఎం.ఎస్ నారాయణతో కామెడీ చేస్తున్న డాన్


తెరపై కామెడీ పండించడంలో మరియు టైమింగ్ తో కూడుకున్న పంచ్ లు వేయడంలో విక్టరీ వెంకటేష్ కి మంచి పేరుంది. వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘షాడో’ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం వెంకటేష్ – ఎం.ఎస్ నారాయణ మీద వచ్చే కామెడీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి కథ అందించిన ప్రముఖ కథా రచయితలు గోపి మోహన్ మరియు కోనా వెంకట్ లు ఈ చిత్రంలో రాసిన మంచి కామెడీ సన్నివేశాలతో ప్రేక్షకులను నవ్వించనున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన తాప్సీ కథానాయికగా నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో వెంకటేష్ నటన మరియు లుక్ చూసి ఆయన ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురవుతారనే వార్తలు చిత్ర వర్గాల నుండి వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో శ్రీ కాంత్ మరియు మధురిమ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే కామెడీ మరియు యాక్షన్ సమపాళ్ళలో ఉంటుందని భావిస్తున్నారు.

Exit mobile version