చివరి దశ చిత్రీకరణలో అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్

చివరి దశ చిత్రీకరణలో అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్

Published on Nov 29, 2012 6:45 PM IST


వరుణ్ సందేశ్ మరియు హరి ప్రియ ప్రధాన పాత్రలలో “అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్” అనే టైటిల్ తో త్వరలో ఒక చిత్రం రానుంది. కోనేటి శ్రీను దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని లక్ష్మణ్ సినీ విజన్స్ బ్యానర్ మీద లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే 90% చిత్రీకరణ పూర్తి చేసుకుంది చివరి షెడ్యూల్ చిత్రీకరణ డిసెంబర్ 3 నుండి హైదరాబాద్లో మొదలు కానుంది. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ “ఈ మధ్యనే నాలుగు పాటలను గోవాలో చిత్రీకరించాము చివరి షెడ్యూల్ లో ప్రత్యేకంగా సారధి స్టూడియోస్ లో నిర్మించిన సెట్లో ఒక పాటను చిత్రీకరిస్తాం. వరుణ్ సందేశ్ కెరీర్ లో ఈ చిత్రం ఒక విభిన్న చిత్రంగా మిగిలిపోతుంది శేఖర్ చంద్ర అందించిన సంగీతం ఈ ఏడాది వచ్చిన మంచి ఆల్బంలలో ఒకటిగా నిలిచిపోతుంది” అని అన్నారు. ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేస్తున్నారు.

తాజా వార్తలు