ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా దీనిని దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్నారు. చాలా కాలం అనంతరం పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే లాక్ డౌన్ మూలాన షూటింగ్ మరియు సినిమా విడుదల కూడా వాయిదా పడడంతో మిగతా షూట్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు. కానీ ఎట్టకేలకు పవన్ రంగంలోకి దిగుతున్నదని టాక్ వచ్చిన నేపథ్యంలో షూట్ మొదలయ్యిపోయినట్టు తెలుస్తుంది.
ఈ నవంబర్ 1 న పవన్ తిరిగి షూట్ లో పాల్గొంటారని వచ్చిన వార్తలు నిజం చేస్తూ వకీల్ సాబ్ ఈరోజు షూట్ లో ల్యాండ్ అయ్యారట. అయితే ఇక చిత్ర యూనిట్ నుంచి ఖచ్చితంగా త్వరలోనే టీజర్ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే నివేతా థామస్, అంజలిలు కీలక పాత్రలో నటిస్తున్నారు.