‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని పోస్టర్ తో జాతర మొదలు..

USB

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ పట్ల మంచి బజ్ కూడా ఇపుడు ఉంది. ఇక ఈ సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజూ కానుకగా జాతర కొంచెం ముందే మొదలైంది అని చెప్పాలి. ఈ వీకెండ్ నుంచే ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేలా లేటెస్ట్ సాలిడ్ పోస్టర్ ని మేకర్స్ ఇపుడు వదిలారు.

ఖచ్చితంగా ఈ ప్రీ లుక్ పోస్టర్ మాత్రం ఎవరు ఊహించని విధంగా ఉందని చెప్పాలి. వింటేజ్ పవన్ కళ్యాణ్ ని గుర్తు చేసేలా ఓ సాంగ్ నుంచి ఈ లుక్ కనిపిస్తుంది. రీసెంట్ గానే ఓ సాంగ్ ని పవన్ కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. అదే కాస్ట్యూమ్ తో పవన్ కనిపిస్తున్నారు. ఇక రేపు సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకి అసలు ఫుల్ మీల్స్ ఉన్నాయి అని చెబుతున్నారు. ఇక రేపొచ్చే పోస్టర్ ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version