ప్రశాంత్ నీల్‌పై ఎన్టీఆర్ ఫుల్ కాన్ఫిడెంట్..!

JrNTR-Neel

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ‘డ్రాగన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను నెక్స్ట్ లెవెల్‌లో తీర్చిదిద్దుతున్నాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్.

అయితే, ఈ సినిమాపై తారక్ అత్యంత భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఆయన రీసెంట్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ‘వార్-2’ అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో తన నెక్స్ట్ చిత్రం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వస్తుండటంతో ఈ సినిమా తన కెరీర్‌కు మంచి బూస్ట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.

ఇక ఈ సినిమాలో తారక్ పాత్ర వేరే లెవెల్‌లో ఉంటుందని.. ఇందులోని కంటెంట్ కూడా అదే స్థాయిలో ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఈ సినిమాలో అందాల భామ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version