ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : ఆగష్టు 31, 2025
స్ట్రీమింగ్ వేదిక : ఈటీవీ విన్
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : శ్రీనివాస్ అవసరాల, సహస్ర శ్రీ, సుమశ్రీ మధిర తదితరులు
దర్శకత్వం : శ్రీకాంత్ దేవరకొండ
నిర్మాణం : ఈటీవీ విన్
సినిమాటోగ్రఫీ : మౌర్య ఇల
సంగీతం : రాకేష్ వెంకటాపురం
ఎడిటర్ : ఎస్ జె శివ కిరణ్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మన తెలుగు ఓటిటి స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో లేటెస్ట్ గా స్ట్రీమింగ్ కి వచ్చిన కొత్త ఎపిసోడ్ నే ‘లెక్కల మాస్టర్’. వీక్లీ సిరీస్ కథా సుధా నుంచి వచ్చిన ఈ ఎపిసోడ్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
తన చిన్నపుడు చదువుకున్న విజిఎస్ స్కూల్ కి ముఖ్య అతిధిగా గణిత శాస్త్రంలో విదేశాల్లో ప్రొఫెసర్ గా పని చేసిన సహస్ర దేవరకొండ (సుమశ్రీ మధిర) వస్తుంది. అలా వచ్చాక తన చిన్ననాటి స్మృతులు అన్నీ గుర్తొస్తాయి. అలా తనకి చిన్నపుడు అసలు లెక్కలంటేనే ఇష్టం లేని సమయంలో తన గురువు లెక్కల మాస్టర్ మల్లికార్జున ప్రసాద్ (శ్రీనివాస్ అవసరాల) ఏం చేశారు? ఆమెకి కూడా లేని నమ్మకాన్ని తాను ఎందుకు అంతలా పెట్టుకున్నారు? చివరికి ఆ మాస్టర్ కి ఏమైంది? ఆమె ప్రయాణంలో ఆయన ప్రభావం ఎలా ఉంది అనేది తెలియాలి అంటే ఈ ఎపిసోడ్ చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ లఘు చిత్రంలో కొన్ని మూమెంట్స్ మంచి డీసెంట్ గా ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్య పరంగా చూపించిన కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. అలాగే కుటుంబం పరంగా చూపించిన సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతాయి.
అలాగే నటీనటుల్లో బాల నటి సహస్ర శ్రీ చాలా బాగా చేసింది. ఆ ఏజ్ రోల్ లో పర్ఫెక్ట్ గా సెట్టవ్వడమే కాకుండా మంచి ఎమోషన్స్ ని బాగా పలికించింది. అలాగే నటుడు శ్రీనివాస్ అవసరాల తన రోల్ కి బాగా సూట్ అవ్వడమే కాకుండా తన పాత్రని అంతే పర్ఫెక్ట్ గా చేశారు.
లెక్కల మాస్టర్ గా తన నటన తన స్టూడెంట్ కి నడుమ పలు డైలాగ్స్ బాగున్నాయి. అలాగే తనపై ఓ ఎమోషనల్ టర్న్ పర్వాలేదు అనిపిస్తుంది. అలాగే వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో సన్నివేశాలు, ఆ సెటప్ ఇంప్రెస్ చేస్తుంది.
మైనస్ పాయింట్స్:
ఈ ఎపిసోడ్ లో కొంచెం ఇబ్బందిగా అంశం ఏదన్నా ఉంది అంటే అది స్లోగా సాగే కథనమే అని చెప్పాలి. 40 నిమిషాల ఎపిసోడ్ కొంతసేపటి తర్వాత అలా సాగదీతగా వెళుతున్నట్టు అనిపిస్తుంది.
అలాగే కొన్ని అంశాల్లో లాజిక్స్ కూడా అంత కరెక్ట్ గా లేవు అనిపిస్తుంది. ఎప్పుడు నుంచో లెక్కల మాస్టర్ గా చేస్తున్న ఉపాధ్యాయునికి తన క్లాస్ లో ఏ విద్యార్థి ఎలా చదువుతున్నారో మినిమమ్ ఐడియా లేకుండా ఉంటుందా? ఇలాంటి చిన్న అంశాలు మిస్ చేశారు.
అలాగే శ్రీనివాస్ అవసరాలపై సడెన్ గా వచ్చే ఎమోషనల్ టర్న్ కూడా కొంచెం ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. ఇవి కొంచెం డిజప్పాయింటెడ్ గా అనిపిస్తాయి.
సాంకేతిక వర్గం:
ఈ ఎపిసోడ్ తాలూకా నిర్మాణ విలువలు మాత్రం చాలా బాగున్నాయి. ఎపిసోడ్ కి కావాల్సిన వింటేజ్ టచ్ ని అన్ని రకాలుగా బాగా డిజైన్ చేసుకున్నారు. ఆర్ట్ వర్క్ నుంచి కెమెరా వర్క్ వరకు కూడా చాలా బాగున్నాయి. సంగీతం కూడా బాగుంది.
ఇక దర్శకుడు శ్రీకాంత్ దేవరకొండ విషయానికి వస్తే.. తాను డీసెంట్ లైన్ ఎంచుకున్నారు దానికి తగ్గట్టుగానే కథనం కూడా కొన్ని చోట్ల బాగా ప్లాన్ చేసుకున్నారు కానీ మిగతా అంశాల్లో కథనం స్లోగా నడిపించారు. ఇవి మినహాయిస్తే తన వర్క్ పర్వాలేదు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ ‘లెక్కల మాస్టర్’ ఎపిసోడ్ లో మంచి సోల్ ఉంది. అందుకు తగ్గట్టుగా కథనం కొంతమేర ఓకే అనిపిస్తుంది కానీ కొన్ని చోట్ల మాత్రం బాగా స్లోగా సాగదీతగా వెళుతుంది. శ్రీనివాస్ అవసరాల, బాల నటి బాగా చేశారు. వారి ట్రాక్ బాగుంది. కాకపోతే ఇంకా జాగ్రత్తలు వహించి ఉంటే ఈ ఎపిసోడ్ మరింత బాగా వచ్చి ఉండేది. సో తక్కువ అంచనాలు పెట్టుకుని ట్రై చేస్తే మంచిది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team