పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సైఫై మైథలాజికల్ చిత్రం ‘కల్కి 2898 ఏడి’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయగా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటించడం, అదిరిపోయే గ్రాఫిక్స్ ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు.
అయితే, ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ అప్పుడే వెల్లడించారు. దీంతో ఈ చిత్ర సీక్వెల్ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతోందా.. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమా సీక్వెల్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ రీసెంట్‌గా ఓ బాంబ్ పేల్చాడు. ఇటీవల ఓ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నాగ్ అశ్విన్, కల్కి సీక్వెల్ మూవీపై ఓపెన్ అయ్యాడు.
వాస్తవానికి 2025 చివరి నాటికి ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని.. ఆ తర్వాత షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌కు భారీ సమయం కేటాయించాల్సి ఉంటుంది కాబట్టి 2026 లేదా 2027 లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఆయన ప్లాన్ చేశారట. కానీ, ప్రస్తుత పరిస్థితులు, నటీనటులు డేట్స్ చూస్తుంటే తను అనుకున్న దానికంటే ఎక్కువ సమయం ఈ సినిమాకు పడుతుందని ఆయన అన్నారు. దీంతో కల్కి సీక్వెల్ ఇప్పట్లో లేనట్లే అనే అంశం క్లియర్ అయిందని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.