టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ హార్రర్ జోనర్ చిత్రం ‘కిష్కింధపురి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేస్తుండగా సరికొత్త హార్రర ఎలిమెంట్‌తో ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అయింది. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 12న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు.
కానీ, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ మనసు మార్చుకున్నారు. ఈ సినిమాను ఒక రోజు ఆలస్యంగా సెప్టెంబర్ 13న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు వారు రెడీ అవుతున్నారు. అయితే, సెప్టెంబర్ 13 శనివారం కావడంతో ఆ రోజు రిలీజ్ ఈ సినిమాకు ఎంతవరకు కలిసొస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్, సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు.