దుబాయ్ గడ్డపై మెరిసిన ‘గామా అవార్డ్స్’ మహోత్సవం

టాలీవుడ్‌లో GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్‌కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పటికే దుబాయ్‌లో నాలుగు ఎడిషన్లు విజయవంతంగా నిర్వహించగా, తాజాగా వైభవ్ జ్యువెలర్స్ సమర్పణలో Keinfra Properties ఆధ్వర్యంలో 5వ ఎడిషన్ వేడుకలు ఆగస్టు 30న షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో అట్టహాసంగా జరిగాయి. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు టాలీవుడ్ ప్రముఖులు హాజరై సందడి చేశారు.

గామా అవార్డ్స్ 2025 జ్యూరీ చైర్‌పర్సన్స్‌గా ప్రముఖ దర్శకులు ఏ. కోదండరామిరెడ్డి, సంగీత దర్శకుడు కోటి, దర్శకుడు బి. గోపాల్ వ్యవహరించారు. వీరి ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో టాలీవుడ్‌కు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అవార్డులు అందుకున్నారు. జాతీయ స్థాయిలో విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం గామా బెస్ట్ మూవీ అవార్డు దక్కించుకుంది.

గామా అవార్డు గ్రహీతలు:

గామా బెస్ట్ యాక్టర్ 2024 – అల్లు అర్జున్ (పుష్ప 2 ది రూల్)
గామా బెస్ట్ హీరోయిన్ – మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
గామా బెస్ట్ మూవీ – పుష్ప 2 (మైత్రి మూవీ మేకర్స్.. యలమంచిలి రవి నవీన్ యెర్నేని)
గామా బెస్ట్ డైరెక్టర్ – సుకుమార్ (పుష్ప 2)
గామా బెస్ట్ ప్రొడ్యూసర్ – అశ్విని దత్, ప్రియాంక దత్, స్వప్న దత్ (కల్కి 2898 AD)
గామా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – దేవిశ్రీప్రసాద్ (పుష్ప 2)
బెస్ట్ కొరియోగ్రఫీ : భాను మాస్టర్ (నల్లంచు తెల్లచీర.. మిస్టర్ బచ్చన్)
బెస్ట్ ఎడిటర్ : నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
బెస్ట్ సినిమాటోగ్రఫీ : రత్న వేలు (దేవర)
బెస్ట్ లిరిసిస్ట్ – రామ జోగయ్య శాస్త్రి (చుట్టమల్లె..దేవర)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ : అనురాగ్ కులకర్ణి (సుట్టమలా సూసి.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ : మంగ్లీ (కళ్యాణి వచ్చా వచ్చా.. ఫ్యామిలీ స్టార్)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ క్రిటిక్ : సమీరా భరద్వాజ్ (నల్లంచు తెల్లచీర.. మిస్టర్ బచ్చన్)
గామా బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ : రజాకార్
గామా బెస్ట్ యాక్టర్ క్రిటిక్ : తేజ సజ్జా
బెస్ట్ పెర్ఫార్మన్స్ యాక్టర్ జ్యూరీ : రాజా రవీంద్ర (సారంగదరియా)
బెస్ట్ యాక్టర్ జ్యూరీ : కిరణ్ అబ్బవరం (క)
బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ : రోషన్ (కోర్ట్)
బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ ఫిమేల్ : శ్రీదేవి (కోర్ట్)
బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ ఫిమేల్ : మానస వారణాశి
బెస్ట్ ఆస్పైరింగ్ డైరెక్టర్ : అప్సర్ (శివం భజే)
గద్దర్ మెమోరియల్ మ్యూజిక్ అవార్డ్ : మట్ల తిరుపతి
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : వినయ్ రాయ్ (హనుమాన్)
బెస్ట్ సపోర్టింగ్ పెర్ఫార్మన్స్ అవార్డ్ : హర్ష చెముడు (సుందరం మాస్టర్)
బెస్ట్ సపోర్టింగ్ కామెడీ రోల్ : బాలిరెడ్డి పృథ్వీరాజ్
బెస్ట్ డెబ్యూ యాక్టర్ ఫిమేల్ : నయన్ సారిక (ఆయ్, క)
బెస్ట్ డెబ్యూ యాక్టర్ జ్యూరీ : ధర్మ కాకాని (డ్రింకర్ సాయి)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ : యదు వంశీ (కమిటీ కుర్రాళ్ళు)
బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ : నిహారిక కొణిదెల (కమిటీ కుర్రాళ్ళు)

గ్లోబల్ కమెడియన్ గా ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం గారు స్పెషల్ అవార్డును అందుకున్నారు. వీరితోపాటు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును నిర్మాత అశ్వినీ దత్ అందుకున్నారు.అలాగే హీరో సత్యదేవ్ జీబ్రా చిత్రానికి గాను ప్రామిసింగ్ యాక్టర్ గా అవార్డును కైవసం చేసుకున్నారు. ఫ్యాన్స్ ఫేవరెట్ స్టార్ అవార్డును అందాల భామ ఊర్వశి రౌటెల అవార్డును అందుకున్నారు.

Exit mobile version