దీపావళికి ‘మిత్ర మండలి’ పాంచ్ పటాకా..!

Mithra-Mandali

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మిత్ర మండలి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను విజయేందర్ సత్తు డైరెక్ట్ చేస్తుండగా ఇందులో ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహ్రా, విష్ణు ఓయ్, నిహారిక ఎన్ఎం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది.

పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అయితే, తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాను దీపావళి బరిలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అక్టోబర్ 16న ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు.

ఇక ఈ సినిమాను బన్నీ వాస్, భాను ప్రతాప, కళ్యాణ్ మంథిన, సోమరాజు ప్రొడ్యూస్ చేస్తుండగా ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి యూత్‌ను థియేటర్లలో ఫుల్టూ ఎంజయ్ చేసేలా చేయడానికి మిత్ర మండలి టీమ్ రెడీ అవుతోంది.

Exit mobile version