నాని – సమంతల ప్రేమకథకి వినూత్నంగా ప్రమోషన్స్

నాని – సమంతల ప్రేమకథకి వినూత్నంగా ప్రమోషన్స్

Published on Dec 1, 2012 11:37 PM IST


యంగ్ హీరో నాని – చెన్నై ముద్దుగుమ్మ సమంత జంటగా నటించిన ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమా ప్రమోషన్స్ సరికొత్త రీతిలో చేస్తున్నారు. గౌతం మీనన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు వెర్షన్ ని తేజ సినిమా బ్యానర్ పై సి. కళ్యాణ్ నిర్మించారు. గౌతం మీనన్ ఇటీవలే ఈ సినిమాకి సంబందిచిన కొన్ని ప్రోమోస్ విడుదల చేసారు. ఈ సీన్స్ సినిమాలో ఉండవు. మామూలుగా అయితే సినిమా విడుదలయ్యాక ఇలాంటి కట్ సీన్స్ ని ప్రమోషన్లో వాడుకుంటారు కానీ వీటి ద్వారా నాని – సమంత పాత్రల్ని ప్రేక్షకులకి పరిచయం చేయాలని ఇలా విడుదల చేసారు. ఇలా చేస్తే వారిద్దరి లవ్ స్టొరీ ఏంటి? ఎలా ఉంటుందా? అనే ఆసక్తితో థియేటర్ కి వస్తారనే ఉద్దేశంతో ఇలా వినూత్నంగా పబ్లిసిటీ చేస్తున్నారు.

మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఆడియో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో నాని – సమంత మధ్య లవ్ స్టొరీని మూడు వేరు వేరు స్టేజుల్లో చూపిస్తారు. క్లైమాక్స్ సూపర్బ్ గా వచ్చిందంటున్న ఈ సినిమా డిసెంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు