గోవాలో రేష్మాతో రోమాన్స్ చేస్తున్న ఉదయ్ కిరణ్

గోవాలో రేష్మాతో రోమాన్స్ చేస్తున్న ఉదయ్ కిరణ్

Published on Nov 28, 2012 4:11 AM IST


ఉదయ్ కిరణ్ మరియు రేష్మలు ప్రధాన పాత్రలలో ఒక చిత్రం రానుంది. “జై శ్రీరామ్” అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ పోలీస్ డ్రామా కోసం రెండు రొమాంటిక్ పాటలను గోవాలో ప్రధాన పాత్రల మీద తెరకెక్కించారు. ప్రస్తుతం హైదరాబాద్లో తాజా షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ఫైవ్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ మీద తెల్ల రమేష్ నిర్మిస్తుండగా బాలాజీ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. దఖే ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రం అయినా తనకు విజయం తెచ్చి పెడుతుంది అని ఉదయ్ కిరణ్ ఆశలు పెట్టుకొని ఉన్నారు. కొన్నాళ్ళు తెలుగు పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్న ఈ హీరో తరువాత చాలా రోజుల వరకు చిత్రాలకు దూరంగా ఉన్నారు.

తాజా వార్తలు