టైసన్ నాయుడు కూడా అప్పుడే వస్తాడా..?

టైసన్ నాయుడు కూడా అప్పుడే వస్తాడా..?

Published on Oct 8, 2025 3:00 AM IST

Tyson-Naidu

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రీసెంట్‌గా ‘కిష్కింధపురి’ అనే హార్రర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. ఇక ఈ సినిమా తర్వాత తన కొత్త ప్రాజెక్ట్ ‘టైసన్ నాయుడు’ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.

అయితే, ఈ చిత్రానికి సంబంధించి తాజాగా సినీ సర్కిల్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాలో నభా నటేష్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్ పై గోపి ఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు