ఆ బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని వదులుకున్న అల్లరి నరేష్.. కారణం ఏమిటో తెలుసా..?

ఆ బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని వదులుకున్న అల్లరి నరేష్.. కారణం ఏమిటో తెలుసా..?

Published on Oct 8, 2025 12:30 AM IST

Allari Naresh

కామెడీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ ప్రస్తుతం కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నాడు. ఆయన తన నెక్స్ట్ చిత్రంగా ‘ఆల్కహాల్’లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ‘సభకు నమస్కారం’ అనే సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు. అయితే, ఆయన తన కెరీర్‌లో ఓ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని వదులుకున్న సంగతి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి గల కారణం తెలిసి అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.

దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కార్తీకేయ’ ఆఫర్ తొలుత అల్లరి నరేష్‌కే వచ్చిందట. ఆయనకు కథ కూడా నచ్చిందట. కానీ, సినిమాలో పాము చుట్టూ కథ సాగడంతో ఆయనకు పాములంటే భయం అనే కారణంగా ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశాడట. ఈ వార్తతో అందరూ అవాక్కవుతున్నారు.

ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ‘కార్తీకేయ 2’ సినిమాతో ఆయన తన కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు