మరో మల్టీప్లెక్స్‌ను తెరుస్తున్న మహేష్ బాబు.. ఎక్కడంటే..?

మరో మల్టీప్లెక్స్‌ను తెరుస్తున్న మహేష్ బాబు.. ఎక్కడంటే..?

Published on Oct 8, 2025 1:00 AM IST

Mahesh-Babu

హైదరాబాద్‌లో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు పార్ట్నర్‌గా ఉన్న AMB సినిమాస్‌కు మంచి క్రేజ్ ఉంది. ఈ థియేటర్‌లో సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఇక తమ అభిమాన హీరో మహేష్ బాబుకి చెందిన థియేటర్ కావడంతో అభిమానుల తాకిడి కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇప్పుడు మహేష్ బాబు మరో మల్టీప్లె్క్స్ థియేటర్‌ను తెరిచేందుకు సిద్ధమయ్యాడు.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో AMB క్లాసిక్ అనే పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్ త్వరలో ప్రారంభం కానుంది. గతంలో సుదర్శన్ 70 ఎంఎం థియేటర్ ఉన్న స్థానంలో ఇప్పుడు ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం జరుగుతోంది. ఇక ఈ మల్టీప్లెక్స్‌లో 7 స్క్రీన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మల్టీప్లెక్స్ థియేటర్‌ను 2026 సంక్రాంతి కానుకగా ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు.

తాజా వార్తలు