టాలీవుడ్‌లో వరుస విజయాలతో గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్, ప్రస్తుతం రవి నెలకుడితి దర్శకత్వంలో ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో వేగంగా సాగుతోంది. ఈ సినిమాతో పూజా హెగ్డే చాలా కాలం తర్వాత టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తోంది.
అయితే, ఈ సినిమాలో నటించేందుకు పూజా హెగ్డే భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో నటిస్తున్నందుకు ఆమె ఏకంగా రూ.3 కోట్ల మేర రెమ్యునరేషన్ అందుకుంటుందట. అయితే, ఆమె రెమ్యూనరేషన్ కారణంగానే తెలుగు సినిమాలకు దూరం అయ్యిందనే టాక్ వినిపించినా, ఇప్పుడు ఆమె తీసుకుంటున్న పారితోషికం ఆమె క్రేజ్ కి నిదర్శనం అని చెప్పాలి.
ఇక రీసెంట్‌గా రజనీకాంత్ ‘కూలీ’ మూవీలో ‘మోనికా’ స్పెషల్ సాంగ్‌లో పూజా చేసిన స్పెషల్ అప్పిరియెన్స్‌కు సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఆ కారణంతోనే ఆమెకు ఇప్పుడు సౌత్‌లో తిరిగి అవకాశాలు దక్కుతున్నాయని సినీ సర్కిల్స్ టాక్.