నందమూరి బాలకృష్ణ తన సినిమాలతో అశేష అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అవుతాయి. ఇక ఆయన వారసుడు మోక్షజ్ఞ కూడా త్వరలో సినీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, ఇప్పుడు బాలయ్య కూతురు కూడా కెమెరా ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
బాలయ్య రెండో కుమార్తె తేజస్విని ఓ జ్యువెలరీ యాడ్ కోసం తొలిసారి కెమెరా ముందుకు రానుంది. ఇప్పటివరకు ఆమె తన తండ్రి సినిమాలకు సంబంధించిన పనులు చూసుకునేది. అయితే, ఇప్పుడు ఆమె ఈ యాడ్ కోసం కెమెరా ముందుకు నటిస్తోందట.
ఈ యాడ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే ముగిసిందని.. త్వరలోనే ఈ యాడ్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఏదేమైనా బాలయ్య కూతురు కూడా కెమెరా ముందుకు వస్తుండటంతో నందమూరి ఫ్యాన్స్‌లో ఈ యాడ్‌పై ఆసక్తి పెరిగింది.