ఇంటర్వ్యూ : డైరెక్టర్ నీరజ కోన – ‘తెలుసు కదా’లో ప్రేమతో పాటు ఎమోషన్ కూడా..!

ఇంటర్వ్యూ : డైరెక్టర్ నీరజ కోన – ‘తెలుసు కదా’లో ప్రేమతో పాటు ఎమోషన్ కూడా..!

Published on Oct 7, 2025 11:30 PM IST

Neeraja-Kona

ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రీసెంట్‌గా ‘మిరాయ్’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు ఈ బ్యానర్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ ఫిల్మ్ మేకర్ నీరజ కోన డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 17న గ్రాండ్ రిలీజ్ చేస్తున్న సందర్భంగా డైరెక్టర్ నీరజ కోన విలేకరుల సమావేశంలో ఈ చిత్ర విశేషాలు పంచుకున్నారు.

కాస్ట్యూమ్ డిజైన్ నుంచి డైరెక్షన్ వైపు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది?

చిన్నతనంలోనే నాకు రైటింగ్, కథలు చెప్పడం ఇష్టం. నాని వంటి స్నేహితులు నన్ను ప్రోత్సహించారు. 12 ఏళ్లుగా కాస్ట్యూమ్ డిజైన్‌లో పని చేశాను. తెలుసు కదా ప్రాజెక్ట్ కోసం సిద్ధు నాపై నమ్మకంతో ఈ కథను ఓకే చేశాడు.

తెలుసు కదా ఎలా ఉండబోతుంది?

ఈ సినిమా ఇద్దరి మధ్య ప్రేమతో కూడిన క్యారెక్టర్ డ్రివెన్ లవ్ స్టోరీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో మూడు ప్రధాన క్యారెక్టర్స్ బలంగా ఉంటారు. ప్రతి క్యారెక్టర్ హానెస్ట్‌గా, ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. టీజర్‌లో కథ రివీల్ చేయలేదు. ఈ మూవీ ట్రైలర్‌లో కథలోని కోర్ పాయింట్ చూపించబోతున్నాం.

డీజే టిల్లు క్యారెక్టర్ నుంచి సిద్ధుని బయటకు ఎలా తీసుకొచ్చారు..?

సిద్ధు కి తన కెరీర్ ప్రారంభంలోనే యూనిక్ క్యారెక్టర్ దొరికింది. దానిని ఆయన అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. సిద్దు గొప్ప పెర్ఫార్మర్. అందుకే ఫస్ట్ సెట్టింగ్‌లో కథ ఓకే చేశాడు. ఇక కాస్ట్యూమ్ డిజైనర్‌గా ‘బాద్షా’ నా తొలి చిత్రం. ఆ అనుభవం ఫిల్మ్ మేకర్ కావడానికి చాలా సాయపడింది.

శ్రీనిధి, రాశి గురించి?

శ్రీనిధి చేసిన రాగ్ చాలా కాంప్లెక్స్ క్యారెక్టర్. ఆమెకు హిట్ 3 చిత్రానికంటే ముందే ఈ రోల్‌ను వివరించారు. ఆమెకు కేజీఎఫ్, హిట్ 3 వంటి సినిమాలు చేయడం చాలా హెల్ప్ అయింది. ఇక అంజలి క్యారెక్టర్‌లో రాశి అద్భుతంగా నటించింది. ఆమెది యూనిక్ పాత్ర.

థమన్ మ్యూజిక్ గురించి?

థమన్ మ్యూజిక్ ఈ సినిమాకు బ్యాక్‌బోన్ అని చెప్పాలి. ఆయన అందించిన అన్ని పాటలు హిట్ అయ్యాయి. ఇక స్కోర్ కూడా అంతే బ్యూటిఫుల్‌గా ఉంటుంది.

పీపుల్ మీడియా ఫాక్టరీ గురించి?

విశ్వ ప్రసాద్ గారు లేకపొతే ఈ సినిమా లేదు. కృతి ప్రసాద్ గారు ఈ సినిమాతో చాలా క్లోజ్ అయ్యారు. వారి సపోర్ట్ ని మర్చిపోలేను.

మీ కొత్త ప్రాజెక్ట్స్ గురించి?

ఒక హార్డ్ హిట్టింగ్ లవ్ స్టొరీ చేయబోతున్నా. త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నాం.

తాజా వార్తలు