మంచు లక్ష్మి ప్రత్యెక పాత్రను తీర్చిదిద్ధనున్న ఇద్దరు ప్రముఖ దర్శకులు

మంచు లక్ష్మి ప్రత్యెక పాత్రను తీర్చిదిద్ధనున్న ఇద్దరు ప్రముఖ దర్శకులు

Published on Sep 25, 2013 11:58 PM IST

Lakshmi-Manchu

మాచు విష్ణు నటిస్తున్న ‘దూసుకెళ్తా’ సినిమాలో మంచు లక్ష్మి ఒక ప్రత్యేక పాత్ర పోషించనుంది. ఇది ఒక ఆసక్తికరమైన విషయం. ఇంతకన్నా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో ఆమె పాత్రను ఇద్దరు ప్రముఖ దర్శకుల దర్సకత్వ పర్యవేక్షణలో జరగనుంది ఆ ఇద్దరు దర్శకులు మరెవరో కాదు. కె రాఘవేంద్ర రావు మరియు దాసరి నారాయణ రావు. మణికొండ దగ్గర వేసిన గంధర్వమహల్ సెట్ లో ఈ దర్శకుల నడుమ లక్ష్మి నటించబోయే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు

కె రాఘవేంద్ర రావు మరియు దాసరి నారాయణ రావు గార్లకి మంచు వారిఫ్యామిలీతో మంచి సంబంధాలు వున్నాయి. కాబట్టి ఇది గౌరవపూర్వకంగా ఇచ్చిన భాధ్యతే అనుకోవచ్చు. ‘దూసుకెళ్తా’ సినిమా ఈ దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల చెయ్యనున్నారు. ఈ సినిమాలో లావణ్య హీరోయిన్. వీరూ పొట్ల దర్శకుడు

తాజా వార్తలు