మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నుంచి సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. ఆయన డైరెక్షన్లో నెక్స్ట్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, త్రివిక్రమ్ తన నెక్స్ట్ చిత్రాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో చేయాల్సింది. కానీ, బన్నీ ప్రస్తుతం అట్లీ చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు.
దీంతో త్రివిక్రమ్ మరికొంత కాలం వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, బన్నీ తన సినిమాను పూర్తి చేసేలోపు త్రివిక్రమ్ కూడా ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. గతంలో విక్టరీ వెంకటేష్‌తో త్రివిక్రమ్ ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. కానీ, ఆ సినిమా ఎందుకో ఆగిపోయింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌ను త్రివిక్రమ్ పూర్తి చేయాలని చూస్తున్నాడట.
వెంకటేష్‌తో త్రివిక్రమ్ రెండు బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించాడు. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు కూడా కోరుతున్నారు. మరి ఇప్పటికైనా వీరి కాంబోలో హ్యాట్రిక్ చిత్రం వస్తుందేమో చూడాలి.