‘సంక్రాంతికి వస్తున్నాం’ X ‘మన శంకర వరప్రసాద్ గారు’? నిజమైతే మాత్రం ఫ్యామిలీస్ దండయాత్రే

‘సంక్రాంతికి వస్తున్నాం’ X ‘మన శంకర వరప్రసాద్ గారు’? నిజమైతే మాత్రం ఫ్యామిలీస్ దండయాత్రే

Published on Aug 22, 2025 9:00 PM IST

sankranthiki-vasthunam-mana

ఈ మధ్య కాలంలో ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతున్న క్రేజీ అంశాల్లో సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ లు కూడా ఒకటి. అంటే ఒక హీరో, లేదా ఒక సినిమా ఎలిమెంట్స్ మరో సినిమాలో కలిసి కనిపించడం అనేది ఆడియెన్స్ కి థియేటర్స్ లో ఒక పీక్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది. మరి ఇది వర్కౌట్ అయితే మాత్రం భారీ లాంగ్ రన్ లు కూడా వాటికి దక్కుతున్నాయి.

అయితే లేటెస్ట్ గా మన టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు అనీల్ రావిపూడి నుంచి వచ్చిన రీసెంట్ రీజనల్ ఇండస్ట్రీ హిట్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి లింక్ ఉంటుంది అన్నట్టుగా అనీల్ రావిపూడి చెప్పిన మాటలతో ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఆల్రెడీ వెంకీ మామ క్యామియో అయితే తాను కన్ఫర్మ్ చేశారు. ఇది ఇలా ఒకొకటిగా కొనసాగుతుంది అన్నట్టు కూడా చెప్పడం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. పైగా సంక్రాంతికి వస్తున్నాంలో వెంకీ మామ పోలీస్ ఇపుడు వరప్రసాద్ గారు లో చిరు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.

సో ఇలా కూడా లింక్ కుదిరింది కాబట్టి మంచి ఫన్ తో కూడిన సాలిడ్ ఎంటర్టైనర్ పడితే మాత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ వీరి కాంబినేషన్ లో ఎంటర్టైనర్ కి బ్రహ్మరథం థియేటర్స్ లో పడతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ ఐడియాని నిజంగానే అనీల్ రావిపూడి ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా వేరే ప్లాన్ చేస్తున్నారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు