ప్రభాస్ కోసం దేనికైనా రెడీ అంటోన్న స్టార్ బ్యూటీ..!

ప్రభాస్ కోసం దేనికైనా రెడీ అంటోన్న స్టార్ బ్యూటీ..!

Published on Aug 23, 2025 12:00 AM IST

Prabhas-And-Pooja-Hegde

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘ది రాజాసాబ్’, ‘ఫౌజీ’ చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రభాస్, ఆ తర్వాత కల్కి 2, సలార్ 2, స్పిరిట్ వంటి సినిమాలను లైన్‌లో పెట్టాడు. అయితే, ప్రభాస్‌తో సినిమా చేసేందుకు ఓ స్టార్ బ్యూటీ చాలా ఆతృతగా ఉన్నట్లు తాజాగా పేర్కొంది.

అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస ఫెయిల్యూర్స్‌తో వెనకబడింది. ఒకప్పుడు వరుస హిట్లతో ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ బ్యూటీ, ఆ తర్వాత బాలీవుడ్‌లోకి షిఫ్ట్ అయింది. అయితే, అక్కడ కూడా వరుస ఫ్లాప్‌లు రావడంతో, ఇప్పుడు తిరిగి సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఇక ఆమె ఇటీవల కూలీ చిత్రంలో మోనికా సాంగ్‌లో చిందులేయగా, దానికి మాంచి రెస్పాన్స్ దక్కింది.

కాగా, టాలీవుడ్‌లోనూ తాను సాలిడ్ కమ్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నానని.. ఒకవేళ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి 3 చిత్రాన్ని తెరకెక్కించే ఛాన్స్ ఉంటే, ప్రభాస్ పక్కన నటించేందుకు తాను ఏం చేయడానికైనా సిద్ధం అంటూ ఓ ఇంటర్వ్యూలో ఆమె కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, గతంలో ప్రభాస్‌తో పూజా చేసిన రాధేశ్యామ్ డిజాస్టర్‌గా నిలిచింది. మరి ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో మళ్లీ సాలిడ్ కమ్ బ్యాక్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు