కూలీ ఎఫెక్ట్ : సైమన్ క్రేజ్.. ఊపేస్తున్న సోనియా..!

కూలీ ఎఫెక్ట్ : సైమన్ క్రేజ్.. ఊపేస్తున్న సోనియా..!

Published on Aug 23, 2025 3:00 AM IST

Nagarjuna

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కూలీ’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజు తెరకెక్కించగా ఇందులో అక్కినేని నాగార్జున సైమన్ అనే విలన్ పాత్రలో నటించాడు. అయితే, ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ను పక్కనబెడితే, ఈ సినిమాలో సైమన్ పాత్రకు వస్తున్న రెస్పాన్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

ముఖ్యంగా నాగార్జున యాక్షన్, స్టైల్‌తో నిండిన ఈ పాత్రలో ఆయన చూపించిన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సీనియర్ హీరో అయినప్పటికీ, నాగార్జున కొత్త లుక్‌తో, మోడరన్ యాటిట్యూడ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. సోషల్ మీడియాలోనూ ఆయన సైమన్ పాత్రపై పాజిటివ్ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇక తమిళ ప్రేక్షకులు మాత్రం ఒక క్లాసిక్ సాంగ్‌తో ఈ సైమన్ పాత్రను ట్రెండ్ చేస్తున్నారు.

నాగార్జున నటించిన ‘రచ్చగన్’(తెలుగులో రక్షకుడు) సినిమాలో సూపర్ హిట్‌గా నిలిచిన “సోనియా సోనియా” పాటను సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ చేస్తున్నారు. ఈ పాటలో నాగార్జున స్టైలిష్ లుక్, సౌండ్‌ట్రాక్‌లోని ఫీల్ ప్రేక్షకుల హృదయాలను మరోసారి గెలుచుకుంటోంది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సాంగ్‌కు సంబంధించిన రీల్స్ రచ్చ చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు