‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. రామ్ నిర్ణయం కరెక్టేనా..?

‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. రామ్ నిర్ణయం కరెక్టేనా..?

Published on Aug 23, 2025 12:30 AM IST

Andhra-King-Taluka

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రామ్ పోతినేని అదిరిపోయే లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యాడు.

ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో ఈ సినిమాలో వీరి కాంబినేషన్ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా, ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను రీసెంట్‌గా ప్రకటించారు మేకర్స్. నవంబర్ 28న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. అయితే, ఇప్పుడు ఈ డేట్ కరెక్టేనా అని అందరూ ఆలోచిస్తున్నారు. సాధారణంగా నవంబర్ నెలలో సినిమాలు డల్‌గా ఉంటాయి. వాటికి వచ్చే రెస్పాన్స్ కూడా అంతంతమాత్రంగా ఉంటుంది.

సెప్టెంబర్, డిసెంబర్ నెలలో చాలా సినిమాలు వస్తుండటంతో వాటితో పోటీ పడటంకంటే సోలో రిలీజ్‌గా రావాలని రామ్ భావించాడు. అందుకే నవంబర్ నెలలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి నవంబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే రామ్ నిర్ణయం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు