హరివల్లభ ఆర్ట్స్ బ్యానర్ పై ఆనంద్ కానుమోలు దర్శకత్వంలో దిలీప్, శ్రావణి, హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా ‘’తొంగి తొంగి చూడమాకు చందమామ”. లవ్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా టిజర్ ఈ మధ్యే విడుదలైంది. అనురాగ్ కులకర్ణి పాడిన ‘’తడబడి పోయానేమో” అనే పాట కూడా సంగీత ప్రియుల మనసు దోచుకుంటున్న విషయం మనకు తెలిసినదే. కాగా ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ అతి త్వరలో విడుదల అయ్యేందుకు సిద్దం అవుతుంది అని ఈ సినిమా యూనిట్ తెలిపారు. అంతే కాక ఈ సినిమా ఆడవాళ్లు మెచ్చే విధంగా ఉంటుంది అని, యూత్ బాగా నచ్చుతుంది అని దర్శకులు తెలిపారు.
అపర్ణ, జెమినీ సురేష్, రాజ్ బాల, స్నేహల్, వింధ్యా రెడ్డి, కుమార్ సాయి, ఆనంత్, లావణ్య, మాధవి ప్రసాద్, కార్తీక్ ఐనాల, శ్రీనివాస్ రాజు వంటి మిగతా తారాగణం నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం గౌర హరి, సింగర్స్ అనురాగ్ కులకర్ణి, హేమ చంద్ర, ధనుంజయ్, యాజిన్ నజీర్. కెమెరా వివేక్ రఫీ, లిరిక్స్ బాలాజీ, కొరియోగ్రాఫర్ శ్రీనివాస్ కె అండ్ వినయ్, ఎడిటింగ్ ఈశ్వర్ 57, ఫైట్స్ రియల్ సతీష్, నిర్మాత ఏ సునీత మోహన్ రెడ్డి, సమర్పణ గురు రాఘవేంద్ర. రచన – దర్శకత్వం ఆనంద్ కానుమోలు. సెన్సార్ కార్యక్రమాలు అనంతరం భారీ ఎత్తున విడుదల చేసేందుకు “తొంగి తొంగి చూడమకు చందమామ” సినిమా సిద్ధం అవుతుందట.