నాగ శౌర్య ఫిల్మ్ ఆగిపోయిందటున్నారే..!

నాగ శౌర్య ఫిల్మ్ ఆగిపోయిందటున్నారే..!

Published on Mar 23, 2020 3:14 PM IST

హీరో నాగ శౌర్య ఇటీవల ఓ నూతన చిత్రాన్ని ప్రారంభించారు. లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ అతిధిగా ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో కొద్దిరోజుల క్రితం ప్రారంభమైంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా రీతూ వర్మను తీసుకోవడం జరిగింది.

కాగా ఈ మూవీ ఆగిపోయిందంటూ టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. దర్శకురాలు లక్ష్మీ సౌజన్యకు మరియు నిర్మాతలకు మధ్య తలెత్తిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా మూవీ హోల్డ్ పడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరి కొద్దిరోజులు ఆగాలి. ఇక ఈ ఏడాది నాగ శౌర్య అశ్వథామ చిత్రంతో ఓ హిట్ అందుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు