కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘ది రాజాసాబ్’ అనే భారీ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాకి సంబంధించి కొన్ని పోస్ట్-ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున ఈ చిత్రం జనవరి 9, 2026న రిలీజ్ కాకపోవచ్చు అని వార్తలు వస్తున్నాయి. దీంతో, అభిమానులు సహజంగానే నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్, టీమ్‌ని ట్యాగ్ చేస్తూ.. .. రిలీజ్ డేట్ పోస్ట్ ఫోన్ పుకార్లపై స్పష్టత అడుగుతున్నారు. మరోవైపు, చిత్ర బృందం ఇటీవల యూరప్‌లో ఒక పాట చిత్రీకరణను ముగించింది.
కాగా ప్రభాస్ తో పాటు, ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ మరియు రిద్ధి కుమార్ కథానాయికలు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. మొత్తమ్మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ ను సిద్ధం చేశాడట. అన్నట్టు ప్రభాస్ కి పూర్తిగా ఇది కొత్త జోనర్ అవుతుంది. ఈ సినిమాకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.


