నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నవంబర్ 7న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయగా దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమాలోని ఎమోషన్స్, కంటెంట్ ప్రేక్షకులను మెప్పిస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 18 నిమిషాలుగా లాక్ చేశారు.
రావు రమేష్, రోహిణి, అను ఇమ్మాన్యుయెల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహీబ్ సంగీతం అందించాడు. అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.


