మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర’ ఇటీవల మంచి అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. భాను బోగవరపు డైరెక్ట్ చేసిన ఈ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి మిక్సిడ్ రెస్పాన్స్ దక్కుతోంది. ఇక ఈ సినిమా థియేటర్లలో మంచి సందడి చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు బుక్ మై షో ప్లాట్‌ఫామ్‌లో సాలిడ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమాకు ఇప్పటివరకు ఏకంగా 200K కిపైగా టికెట్లు అమ్ముడైనట్లు బుక్ మై షో వెల్లడించింది. వీకెండ్ సెలవులు ఈ సినిమాకు కలిసొచ్చాయని సినీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇక అసలు పరీక్ష ముందుందని వారు కామెంట్ చేస్తున్నారు.
ఈ సినిమాలో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాయి.



