ప్రస్తుతం బుల్లితెరపై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రియాలిటీ షోలలో బిగ్‌బాస్ కు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు, తమిళ, హిందీతో పాటు పలు ఇతర భాషల్లోనూ ఈ రియాలిటీ షోకు మంచి క్రేజ్ ఉంది. అయితే, ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ షోలో ఓ కంటెస్టెంట్ పై ఆయన మాజీ భార్య చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
హిందీలో బిగ్‌బాస్ సీజన్ 19 నడుస్తోంది. ఈ షోలో బుల్లితెర నటుడు అభిషేక్ బజాజ్ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి అడుగుపెట్టాడు. అయితే, అతని మాజీ భార్య ఆకాంక్ష జిందాల్ ఆయనపై తీవ్ర విమర్శలు చేసింది. వైవాహిక జీవితంలో అభిషేక్ తనను మోసం చేశాడని.. అతడికి ఎంతో మంది అమ్మాయిలతో రిలేషన్స్ ఉన్నాయని.. అందుకే అతడి నుంచి విడాకులు తీసుకున్నానని ఆకాంక్ష ఆరోపించింది. బిగ్‌బాస్ లో కూడా అతడు అబద్దాలు చెబుతున్నాడని.. తన వయసును తక్కువగా చెబుతూ సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ ను కూడా మోసం చేస్తున్నాడని ఆమె పేర్కొంది.
అతడి గురించిన నిజాలు బిగ్ బాస్ హౌజ్‌మేట్స్ కూడా తెలుసుకోవాలనే తాను ఈ కామెంట్స్ చేస్తున్నట్లు ఆమె తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది.


