రష్మిక మందన్న – దీక్షిత్ శెట్టి జంటగా నటించిన “ది గర్ల్ ఫ్రెండ్” ఈ నెల 7న తెలుగు, హిందీలో.. 14న తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు నిర్మిస్తున్న ఈ ఎమోషనల్ లవ్ స్టోరీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో దీక్షిత్ శెట్టి మీడియాతో ముచ్చటించారు.
– దసరా తర్వాత నాకు వచ్చిన అత్యంత ప్రత్యేక అవకాశం ఇది. రాహుల్ రవీంద్రన్ గారు నన్ను ‘విక్రమ్’ పాత్రకు ఫిక్స్ అయ్యారు. స్క్రిప్ట్ చదివిన తర్వాత ఆ పాత్ర నాకెంత దగ్గరగా ఉందో అర్థమైంది. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి.
– విక్రమ్ ఒక లేయర్డ్ క్యారెక్టర్. ట్రైలర్ చూసి కొందరు టాక్సిక్ బాయ్‌ఫ్రెండ్ అని అనుకుంటున్నారు, కానీ అతని భావోద్వేగాలు, మనసులోని సంఘర్షణలు వేరు. రాహుల్ గారికి ఉన్న స్పష్టమైన దృష్టి వల్ల ఆ పాత్రలో ఈజీగా ఇమిడిపోయాను.
– రష్మిక స్క్రీన్‌పై కనిపించగానే ‘భూమా’ పాత్రలోకి పూర్తిగా ఒదిగిపోతుంది. రష్మిక పర్‌ఫార్మెన్స్ ఈ సినిమాలో హైలైట్ అవుతుంది. స్టార్ అయినా కూడా సెట్లో చాలా సింపుల్‌గా, ఫ్రెండ్లీగా ఉండేది.
– ఈ సినిమాలో ప్రేమ కథను రియలిస్టిక్‌గా చూపించే ప్రయత్నం చేశాం. ఈ సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు మన రియల్ లైఫ్‌తో కనెక్ట్ అవుతాయి. యూత్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా దీన్ని ఫీల్ అవుతారు.
– షూటింగ్ సమయంలో అల్లు అరవింద్ గారు రషెస్ చూసి పిలిచి నెక్ట్స్ ప్రాజెక్ట్‌కి అడ్వాన్స్ ఇచ్చారు. కెరీర్ ప్రారంభ దశలో ఉన్న నాకు ఇది పెద్ద మోటివేషన్.
– ఇక నెక్స్ట్ ప్రాజెక్టులలో భాగంగా కన్నడలో చేసిన బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఈ నెల 21న తెలుగులో రిలీజ్ అవుతోంది. అలాగే షబానా, కేజేక్యూ వంటి సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. మలయాళం, తమిళం, తెలుగు అన్ని భాషల్లోనూ విభిన్నమైన పాత్రలు చేయాలనుకుంటున్నాను.
– హేషమ్ ఇచ్చిన సంగీతం ఈ సినిమాకి సోల్ లాంటిది. ఏం జరుగుతుంది నా ఫేవరెట్ సాంగ్. ఈ సినిమా నా కెరీర్‌లో బెస్ట్ ఫిలిం అవుతుందనే నమ్మకం ఉంది.


