యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు మౌళి తనూజ్ హీరోగా పరిచయం అవుతూ చేసిన లేటెస్ట్ చిత్రమే “లిటిల్ హార్ట్స్”. దర్శకుడు సాయి మార్తాండ్ కి కూడా మొదటి సినిమా ఇదే కాగా వీరు తమ డెబ్యూ చిత్రం తోనే అదరగొట్టి దుమ్ము లేపుతున్నారు. ముఖ్యంగా పైడ్ ప్రీమియర్స్ నుంచే సాలిడ్ రెస్పాన్స్ ని అందుకున్న ఈ చిత్ర యూనిట్ ఇపుడు వసూళ్లు ఇంకా బుకింగ్స్ పరంగా కూడా స్ట్రాంగ్ హోల్డ్ కనబరుస్తుంది.
అంత పోటీలో దిగినప్పటికీ ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో డామినేషన్ చూపిస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనితో లిటిల్ హార్ట్స్ మేకర్స్మాత్రం మంచి జాక్ పాట్ కొట్టారని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో శివాని నాగారం హీరోయిన్ గా నటించగా రాజీవ్ కనకాల తదితరులు నటించారు. అలాగే ఆదిత్య హాసన్, ఈటీవీ ఒరిజినల్స్ వారు నిర్మాణం వహించారు.