వైరల్ పిక్: ‘ఇంద్ర’ సెట్స్ లో బాలయ్య సందడి చూసారా?

వైరల్ పిక్: ‘ఇంద్ర’ సెట్స్ లో బాలయ్య సందడి చూసారా?

Published on Sep 7, 2025 9:03 PM IST

మన తెలుగు సినిమా దగ్గర ఒకో సమయంలో ఒకో బ్యాక్ డ్రాప్ సినిమాలు రూల్ చేసాయి. అలా ఒక రెండున్నర దశాబ్దాల కీతంకి వెళితే ఆ సమయంలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలు ఏ రేంజ్ లో క్లిక్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి వాటిలో అయితే బాలయ్యదే పైచేయి.

ఒక సమర సింహా రెడ్డి, నరసింహా నాయుడు, చెన్నకేశవ రెడ్డి ఇలా పలు చిత్రాలతో బాలయ్య దుమ్ము లేపితే మెగాస్టార్ చిరంజీవి కూడా “ఇంద్ర” సినిమా చేసి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశారు. ఇలా అప్పట్లో ఫ్యాక్షన్ సినిమాలు పరంగా ఇద్దరు స్టార్స్ నడుమ గట్టి పోటీ ఉండేది.

అయితే ఇంద్ర సినిమా సెట్స్ లో బాలయ్య సందడి చేశారన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఇదే స్పెషల్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంద్ర సేనా రెడ్డి గెటప్ లో చిరంజీవి షూట్ బ్రేక్ లో ఉంటే తనతో పాటుగా పక్కనే నట సింహ బాలయ్య అలాగే నిర్మాత అశ్విని దత్ ఉన్నారు. దీనితో ఈ రేర్ పిక్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.

తాజా వార్తలు