మలేసియాలో సాగుతున్న పైరసీ వ్యాపారంలో ఆంధ్రా యువకుడి ప్రధాన హస్తం

మలేసియాలో సాగుతున్న పైరసీ వ్యాపారంలో ఆంధ్రా యువకుడి ప్రధాన హస్తం

Published on Sep 26, 2013 10:00 PM IST

shiva-kumar

అంతర్జాలంలో పైరసీ భూతాన్ని భారీ రీతిలో పెంచి పోషించిన ఒక వ్యక్తి ఆంధ్రాకు చెందిన తెలుగు యువకుడు అని మలేసియా పోలీసులు నిర్దారించడం మనకు బాధాకరమైన విషయం.

యలమంచి శివకుమార్ అనే అతను అన్ని భాషల సినిమాలను నెట్ లో పెట్టే ఆఫీస్ ను మలేసియా నుండి నడుపుతున్నాడు. సినిమా విడుదలైన రెండో రోజే పైరసీ సినిమా ప్రింట్ అతని ఆఫిస్ టేబుల్ మీదకు వచ్చేస్తాయి. వాటిని క్షణాల్లో నెట్ లో వుంచుతాడు. అతని సాఫ్ట్ వేర్ పరిజ్ఞానం ఇటువంటి 8 పైరసీ సైట్ లకు, కొన్ని వందల యూజర్ ఎకౌంటుల రూపంలో వాడుకలోవున్నాయి. అతని యొక్క ముఖ్య కార్యకలాపాలు www.tktorrents.com.ద్వారా సాగుతున్నాయి

ఇతనికోసం మలేసియాలో ఒక ప్రత్యేక పోలీసు బృందంవెళ్లనున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్నాక మరిన్ని వివరాలు తెలుపుతారు. ఇటువంటి కేసులకు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటూ చట్టాన్ని ప్రవేసపెట్టాలని కొంతమంది కోరిక. కూడా ఇటువంటి సైట్ లను వాడకుండా వుంటే సినిమా వ్యవస్థకు మంచి చేసినవాళ్ళము అవుతాము

తాజా వార్తలు